పరిచయము

ఆనగనగ ఒక రాజు. ఆతని పేరు సుదర్శనుడు. అతనికి మగపిల్లలు ఉన్నారు కాని వారికి లోక జ్ఞానం లేదు. వారికి సులభంగా విద్యాబుద్ధులు నేర్పి ఇంగిత జ్ఞానాన్ని ఇవ్వగల గురువు కోసం వెతుకుతున్న రాజు కి తమ పాటలిపుత్ర నగరం లొనె విష్ణుశర్మ అనే ఉత్తమ బ్రాహ్మణుడు ఉన్నాడని తెలిసింది. ఆయనకు కబురు పెట్టాడు. తన పిల్లల సంగతి చెప్పాడు. వారికి తక్కువ కాలంలో లోక జ్ఞానం తెలిసేలా చేయమన్నాడు.

విష్ణుశర్మ 'అలాగే అని ఆ బాలకుల్ని తీసుకువెళ్ళాడు. వారికి చిన్న చిన్న కధల ద్వారా లోకజ్ఞానాన్ని, రాజనీతిని బోధించాలనుకున్నడు. వారు కూడా కధల పట్ల ఆసక్తి చూపేరు. విష్ణుశర్మ చెప్పిన నీతి కధలు అన్నింటినీ కలిపి "పంచ తంత్రం" అంటారు. "పంచ" అంటే ఐదు అని "తంత్రం" అంటే ఉపాయం అని అర్ధం. మనిషి కాని రాజు కాని తమ జీవితం లో ఎదురయ్యే ఎటువంటి సమస్యలను ఐనా ఈ ఐదు రకాల ఉపాయాలతో గట్టెక్కవచ్చని విష్ణుశర్మ వారికి ఉపదేశించాడు. ఆ ఉపాయాలు 1. మిత్రలాభం 2. మిత్రభేదం 3. విగ్రహం 4. సంధి 5. లబ్ధనాశం.

వీటిలొని కొన్ని కధలను ఇప్పుడు చదువుదాం:   హిరణ్యకుని కథ

No comments:

Post a Comment