హిరణ్యకుడు ఒక ఎలుక చాల తెలివైనది, మంచిది. ఎటువంటి అవమానాన్ని భరించలేదు. తనవారెవరికి యే ఆపద వచ్చినా వెంటనే సహాయం చేసే ఉపకార గుణం ఉన్న మంచి ఎలుక అది.
ఒక నగరం లో మఠం లో ఉంటుండేది. అక్కడ సాథువులు ఎక్కువ గా వుండేవారు. వారిలో చుడాకర్ణుడు అనే సాధువు ఒకడు. అతను మఠం లోని తన గదిలో ఒక చిలకకొయ్యకు తాడుకట్టి దానికి తన జోలి తగిలించేవాడు. ఆ జోలెలో బియ్యం వగైరా వుండెవి.
ఆతని గది ప్రక్కనే నేలలో హిరణ్యకుడు పెద్ద కన్నం చేసి అందులో వుంటుండేది. చుడాకర్ణుడు జోలిలో వదిలివేసిన బియ్యన్ని, ఇతర ఆహార పదర్ధాలని రహస్యంగా దొంగిలించి తన కన్నం లో దాచేది. ఈ రకంగా ఆ ఎలుక చాల ఆహరాన్ని నిలవచేసింది. దాని జాతివారిలో అదే గొప్పది.
అయితే చూడాకర్ణుడు ఒకనాడు ఎలుక సంగతి పసిగట్టాడు. తాను దాచుకున్న వాటినన్నింటిని దొంగిలిస్తున్న ఎలుకల్ని నాశనం చేయాలని నిశ్చయించాడు. మరునాడు గునపం తెప్పించి ఎలుక కన్నము తవ్వించాడు. కనిపించిన ఎలుకనల్లా చంపించాడు. తెలివైన హిరణ్యకుడు మాత్రం తప్పించుకుంది. కాని అవమానం జరిగిన చోట వుండరాదని అక్కడనుంచి వెళ్ళిపోవాలనుకుంది.
పట్టణాలలో ఐతే యెక్కడ ఉన్నప్పటికీ ఇటువంటి అవమానాలు తప్పవనీ, అరణ్యములో ఐతే పళ్ళు ఫలాలు తిని హాయిగా స్వేచ్చగా బ్రతుకవచ్చని ఆలోచించి హిరణ్యకుడు అడవిలోకి వెళ్ళిపోయింది.
అడవి లో దానికి మంధరుడు అనే తాబేలు, లఘుపతనకుడు అనే కాకి స్నేహితులయ్యారు. మూడు ఎంతో స్నేహంగా వుంటున్నాయి. ఈ హిరణ్యకునికి చిత్రగ్రీవుడు అనే ఒక పావురం కూడా స్నేహితుడు.
ఒకసారి అడవిలో వేటగాడు నూకలు చల్లి వలపన్ని దూరంగా పోయి దాక్కుని చూస్తున్నాడు. అదే సమయంలో అటువైపుగా ఆకాశంలో ఎగురుతూ పావురాళ్ళ గుంపు వచ్చింది. భూమి మీద నూకలు చూసి తినాలనుకున్నాయి. ఆ పావురాళ్ళలో చిత్రగ్రీవుడు కూడా వున్నాడు.
"అడవిలో నూకలు రావడం విచిత్రంగా వుంది. ఇది యెవరో వేటగాని పన్నగం. మనం దిగవద్దు" అని చిత్రగ్రీవుడు అడ్డు చెప్పాడు. దురాశ దుఃఖానికి చేటు, అంతే కాదు ఒక్కొక్కసారి ప్రాణాంతకం కుడా అని హెచ్చరిస్తూ పులి బ్రాహ్మణుని కథ చెప్పసాగేడు.
No comments:
Post a Comment