Jaya jaya jaya priya bharata janayitri

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి (2)
జయ జయ జయ సుశ్యామల

సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా
చరిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ
లాక్షారుణ పదయుగళా (జయ)

జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరితోషణ
జయౌ గాయక వైతాళిక
గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ
చుంబిత సుందర చరణ (జయ)

No comments:

Post a Comment